
టెక్నాలజీ

2027-28 ఆర్థిక సంవత్సరానికి పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ముందుకు సాగుతోంది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, ప్రస్తుతం పాలిమర్ నోట్లపై ఫీల్డ్ ట్రయల్స్ జరుగుతున్నాయని, వాటి మన్నిక, భద్రతా ఫీచర్లు, పని తీరును పూర్తిగా పరీక్షించిన తర్వాతే ప్రజల వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ₹10, ₹20 పాలిమర్ నోట్ల ఫీల్డ్ ట్రయల్స్‌కు ఆమోదం తెలిపింది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా 100 కోట్ల ₹10 నోట్లు, 100 కోట్ల ₹20 నోట్లు విడుదల చేసి దేశంలోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించనున్నారు. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా తొలగించే ప్రతిపాదన లేదని, ట్రయల్స్ విజయవంతమైతే పాలిమర్ నోట్లు వాటితో పాటు చలామణిలో ఉంటాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!