
సినిమాలు

అమరరాజా గ్రూప్ చైర్మన్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్‌తో తమకు ఉన్న బలమైన అనుబంధాన్ని మరోసారి స్పష్టం చేశారు. సంస్థ ప్రయాణం ఏపీలోనే ప్రారంభమైందని, ఈ ప్రాంతం తమకు ఎప్పటికీ ప్రత్యేకమని తెలిపారు. తెలంగాణలో విస్తరణపై ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్‌పై తమ నిబద్ధత ఎప్పటికీ తగ్గదని, భవిష్యత్తులో ఈ బంధం మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
లోకేశ్ ఆత్మీయతకు ధన్యవాదాలు తెలుపుతూ, కలిసికట్టుగా కొత్త అవకాశాలను సృష్టించి మరింత మంచి భవిష్యత్తును నిర్మించాలన్న ఆశ వ్యక్తం చేశారు. ఇంతకుముందు లోకేశ్, చిత్తూరులో స్థాపితమైన అమరరాజ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఏపీకి గుర్తింపు తెచ్చిందని, అయితే గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్నదని పేర్కొన్నారు. భవిష్యత్తులో సంస్థ అభివృద్ధికి రాష్ట్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!