
జనరల్

ఫిఫా ప్రపంచకప్ ముగింపు మ్యాచ్ల సందర్భంగా ఫుట్బాల్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బార్లు, క్లబ్లు జూలై 19న థర్డ్ ప్లేస్ మ్యాచ్ సందర్భంగా తెల్లవారుజామున 4:30 గంటల వరకు, జూలై 20న ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచి ఉండేందుకు అనుమతి ఇచ్చారు.
ఫుట్బాల్ అభిమానులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యాచ్లను వీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ ముగింపు మ్యాచ్ల సందర్భంగా ఈ తాత్కాలిక సడలింపు అమల్లో ఉండనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!