
సినిమాలు

నీట్-యూజీ పరీక్షలో 720 మార్కులకు గాను 715 మార్కులు సాధించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న ఆర్యన్ గుప్త తన కృషి, పట్టుదలతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. వైద్యుల కుటుంబానికి చెందిన ఆర్యన్ ప్రతిరోజూ 16 నుంచి 17 గంటల పాటు చదువుకు సమయం కేటాయించి, విశ్రాంతి, నిద్రను కూడా పక్కనపెట్టి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. క్రమశిక్షణ, అంకితభావం ఉంటే విజయాన్ని సాధించవచ్చని ఆయన నిరూపించాడు.
అయితే ఆర్యన్ విజయం వెనుక ఒక భావోద్వేగ కథ ఉంది. క్యాన్సర్ కారణంగా తన అమ్మమ్మను కోల్పోవడం ఆయన జీవితాన్ని ప్రభావితం చేసింది. ఆ సంఘటనతో ప్రేరణ పొందిన ఆర్యన్ భవిష్యత్తులో ఆంకాలజిస్ట్‌గా మారి క్యాన్సర్ రోగులకు సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. వ్యక్తిగత బాధను సమాజ సేవగా మార్చాలనే అతని సంకల్పం అందరినీ ఆకట్టుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!