
జనరల్

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో బాక్సైట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ర్యాలీలో పాల్గొన్న ఆదివాసీలు ఐటీడీఏ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బాక్సైట్ మైనింగ్‌ను పూర్తిగా నిలిపివేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి.
మరోవైపు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిపై గీతం యూనివర్సిటీ రూ.5 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేసింది. యూనివర్సిటీకి చెందిన నిర్మాణ ప్రాజెక్టుపై ఆమె చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని యాజమాన్యం పేర్కొంది. అసత్య ప్రచారంతో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపిస్తూ న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు గీతం యూనివర్సిటీ తరఫు న్యాయవాది టి. కనకరాజు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!