
క్రీడలు

ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ హార్మూజ్ జలసంధిపై కీలక ప్రకటన చేశారు. మిత్రదేశాలకు ఈ సముద్ర మార్గంలో ఎలాంటి అడ్డంకులు ఉండవని స్పష్టం చేశారు. ఈ అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రితో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. భారత్‌కు అవసరమైన ఆయిల్, గ్యాస్ సరఫరాలకు అంతరాయం కలగకుండా పూర్తి రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
శత్రుదేశాలకు మాత్రమే హార్మూజ్ జలసంధి వినియోగంపై పరిమితులు ఉంటాయని అరాగ్చీ పేర్కొన్నారు. భారత్‌కు ఆయిల్ ఎగుమతులు కొనసాగించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని తెలిపారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వచ్చిన ఈ ప్రకటన భారత్ ఇంధన భద్రతకు కీలకంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!