
జనరల్

బండి భగీరథ్ కు సంబంధించిన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. శనివారం రాత్రి లొంగిపోయిన భగీరథ్‌ను బాధితురాలి వాంగ్మూలం, ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రశ్నించారు. అనంతరం భగీరథ్ తెలిపిన వివరాలను బాధితురాలి వాంగ్మూలంతో సరిపోల్చి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.
బాధితురాలిపై అఘాయిత్యం జరిగిన సమయంలో అక్కడే ఉన్న భగీరథ్ స్నేహితులు ఘటన అనంతరం రాజీకి ప్రయత్నించారని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 10 మంది పేర్లు ప్రస్తావనకు రావడంతో, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు భగీరథ్ స్నేహితులను కూడా పోలీసులు విచారించనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!