

భారత యువ క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన కాబోయే భార్యగా ప్రచారంలో ఉన్న ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక రహస్య పోస్టు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఎవరి పేరును ప్రస్తావించకుండా పలుమార్లు మోసం చేశారని పేర్కొంటూ ఆమె పోస్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. కొద్దిసేపటికే ఆ పోస్టును తొలగించినప్పటికీ, స్క్రీన్‌షాట్లు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా, ఆకృతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఎంగేజ్‌మెంట్ ఫొటోలను తొలగించి, పృథ్వీ షాను అన్‌ఫాలో చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు పృథ్వీ షా లేదా ఆకృతి అగర్వాల్ అధికారికంగా స్పందించలేదు.
ఇదిలా ఉండగా, పృథ్వీ షా క్రికెట్ కెరీర్ కూడా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చోటు దక్కినప్పటికీ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదని సమాచారం. అండర్-19 ప్రపంచకప్ విజేత జట్టుకు నాయకత్వం వహించి భారత జట్టులోకి దూసుకొచ్చిన షా, ఫిట్‌నెస్ సమస్యలు, పేలవ ఫామ్, మైదానం వెలుపల వివాదాల కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండింటికీ సంబంధించిన తాజా పరిణామాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!