

హైదరాబాద్‌కు చెందిన శిశువైద్య నిపుణురాలు డాక్టర్ శివరంజని సంతోష్ అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు ఊరటనిచ్చేలా కీలక ప్రయత్నం చేశారు. అలన్-హెర్ండన్-డడ్లీ సిండ్రోమ్ (AHDS) అనే అరుదైన వ్యాధి చికిత్సకు ఉపయోగించే టిరాట్రికాల్ (Tiratricol) ఔషధం ధరను భారీగా తగ్గించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. యాక్సెస్ టు మెడిసిన్స్ ఇండియా, అంతర్జాతీయ ఫౌండేషన్ సహకారంతో ఈ ఔషధం వార్షిక వ్యయాన్ని గతంలో గరిష్ఠంగా ఉన్న రూ.9 కోట్ల నుంచి ఒక్కో చిన్నారికి సుమారు రూ.2.5 లక్షలకు తగ్గించగలిగారు.
ఈ ప్రయత్నంలో భాగంగా ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు సరిపడా టిరాట్రికాల్ ఔషధాన్ని నవంబర్ 30, 2026న పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. అరుదైన వ్యాధుల చికిత్స కోసం భారీ మొత్తాలు ఖర్చు చేయాల్సి వస్తున్న కుటుంబాలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. ఔషధ ధర తగ్గడంతో పాటు ఉచితంగా మందులు అందించే ఈ కార్యక్రమం చిన్నారుల చికిత్సకు కొత్త ఆశలు కల్పిస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!