
జనరల్

హైదరాబాద్‌లో ప్రీమియం రియల్ ఎస్టేట్ మార్కెట్ మరో కీలక ఘట్టానికి చేరుకుంది. రాయదుర్గంలోని రహేజా నాలెడ్జ్ సిటీలో ఉన్న 11.38 ఎకరాల అత్యంత విలువైన భూములు త్వరలో వేలానికి రానున్నాయి. ప్రముఖ ఐటీసీ కోహినూర్ సమీపంలో ఉన్న ఈ స్థలాలపై ప్రీ–బిడ్ దశలోనే దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), అంతర్జాతీయ ఐటీ కంపెనీలు వేగంగా విస్తరిస్తుండటంతో రాయదుర్గం ప్రాంతం హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన కమర్షియల్ కేంద్రంగా మారింది. ఇదే ప్రాంతంలో గతంలో ఎకరానికి రూ.177 కోట్ల ధర నమోదుకాగా, రాబోయే వేలంలో అది రూ.200 కోట్ల మార్క్‌ను దాటే అవకాశముందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!