
క్రీడలు

తిరుపతిలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై ఇప్పటికే ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ నివేదికపై తదుపరి చర్యలు తీసుకోవడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కమిటీ అధ్యక్షుడిగా నియమించగా, పోలీసు విభాగం ప్రధాన అధికారి మరియు న్యాయశాఖ కార్యదర్శిని సభ్యులుగా చేర్చారు.
ఏకసభ్య కమిటీ చేసిన సిఫార్సులను అమల్లోకి తీసుకురావడం, బాధ్యులపై పరిపాలనా క్రమశిక్షణ చర్యలు చేపట్టడం, చట్టపరమైన నేర విచారణలకు సిఫార్సు చేయడం వంటి అంశాలను కమిటీ పరిశీలించనుంది. అలాగే కాలపరిమితితో కూడిన అమలు ప్రణాళికను రూపొందించి, ప్రభుత్వ నిర్ణయాల అమలుకు పర్యవేక్షణ వ్యవస్థను ఎలా ఏర్పాటు చేయాలన్న దానిపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!