
గాసిప్స్

చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్పపల్లకి సేవను కన్నులపండువగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన పల్లకిపై సిద్ధి–బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారిని కొలువుదీర్చి కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య పుష్పపల్లకి సేవ భక్తిశ్రద్ధలతో సాగింది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, కార్యనిర్వహణాధికారి, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఉభయదారులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!