

హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మై భారత్ పోర్టల్, ఇండియన్ రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదును మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి కళాశాలలో నోడల్ అధికారులు, స్టూడెంట్ అంబాసిడర్లను నియమించి రోజువారీ పురోగతిని సమీక్షిస్తూ రాష్ట్రానికి నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు నషా ముక్త్ భారత్ అభియాన్ కీలకమని, ఆరోగ్యవంతమైన యువతే దేశ భవిష్యత్తుకు బలమని గవర్నర్ పేర్కొన్నారు.
తెలంగాణకు మై భారత్ పోర్టల్‌లో 14.90 లక్షల నమోదుల లక్ష్యం ఉండగా ఇప్పటివరకు 4.04 లక్షల నమోదులు పూర్తయ్యాయని, నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్‌లో 2.73 లక్షల ప్రతిజ్ఞల లక్ష్యానికి గాను 91 వేలకుపైగా నమోదయ్యాయని గవర్నర్ తెలిపారు. మరోవైపు రెడ్‌క్రాస్ సభ్యత్వం 1.17 లక్షలకు చేరిందని, ఆగస్టు 15 నాటికి విశ్వవిద్యాలయాల నుంచి మరో 16 వేల మంది సభ్యులను నమోదు చేయాలని సూచించారు. రక్తదాన శిబిరాలు, విపత్తు నిర్వహణ, యువజన అవగాహన కార్యక్రమాల్లో విశ్వవిద్యాలయాలు చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!