

ఆస్కార్ 2027లో భారత్ తరఫున పోటీ పడేందుకు మరాఠీ చిత్రం ‘గోంధల్’ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. 99వ అకాడమీ అవార్డ్స్‌లోని బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి ఈ సినిమాను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) సెప్టెంబర్ 18న ప్రకటించింది. దేశంలోని వివిధ భాషలకు చెందిన 33 చిత్రాల నుంచి ‘గోంధల్’ను ఎంపిక చేశారు. సంతోష్ ధవకర్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గ్రామీణ మహారాష్ట్ర నేపథ్యంలో సంప్రదాయ గోంధల్ ఆచారాన్ని కథలో కీలకంగా చూపిస్తుంది.
ఈ చిత్రంలో కిషోర్ కదమ్, ఇషితా దేశ్‌ముఖ్, యోగేశ్ సోహోనీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2025 నవంబర్‌లో విడుదలైన ‘గోంధల్’కు ఇప్పటికే పలు ప్రశంసలు దక్కాయి. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సంతోష్ ధవకర్‌కు బెస్ట్ డైరెక్టర్‌గా సిల్వర్ పీకాక్ అవార్డు లభించింది. ‘గోంధల్’ ఎంపికతో మరాఠీ సినిమాకు మరోసారి అంతర్జాతీయ వేదికపై గుర్తింపు లభించింది. 99వ అకాడమీ అవార్డ్స్ 2027 మార్చి 14న జరగనున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!