

మహిళా సంఘాల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అర్హత కలిగిన మహిళా సంఘాలకు అందిస్తున్న 5 లక్షల రూపాయల వడ్డీలేని రుణ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచింది. పది లక్షల రూపాయల వరకు మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది రెండువేల ఐదు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది.
ఈ ఏడాది 4.33 వేల మహిళా సంఘాలకు మొత్తం 26,621.4 కోట్ల రూపాయల రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. మహిళలు స్వయం ఉపాధి, పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించేందుకు కూడా రుణ సహాయం అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షలకుపైగా మహిళలు ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!