
రాజకీయాలు

గ్లాస్గోలోని ఓ రెస్టారెంట్లో నాప్కిన్లపై భారతదేశ అసంపూర్తి మ్యాప్‌ను ముద్రించడంపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ సంస్థ క్షమాపణలు చెప్పింది. కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్‌తో పాటు ఇతర అథ్లెట్లు ఆ రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో ఈ తప్పిదాన్ని గుర్తించారు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, కశ్మీర్ ప్రాంతాలను సరిగా చూపించకపోవడంపై లవ్లీనా సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై భారత బాక్సింగ్ ఫెడరేషన్, స్కాట్లాండ్లోని భారత రాయబార కార్యాలయం స్పందించాయి.
ఈ ఘటనపై మిస్టర్ సింగ్స్ ఇండియా అధికారిక ప్రకటన విడుదల చేసి క్షమాపణలు తెలిపింది. పొరపాటును వెంటనే సరిదిద్దుతామని, సరైన మ్యాప్‌తో లోగోను మార్చనున్నట్లు ప్రకటించింది. ఈ తప్పిదం ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశంతో చేయలేదని, భారత వారసత్వాన్ని గౌరవిస్తున్నామని రెస్టారెంట్ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!