

అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం, చైనా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా ప్రజలపై నిఘా నిర్వహించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఇందులో చైనా పౌరులతో పాటు ఆ దేశాన్ని సందర్శించిన విదేశీయుల వివరాలు కూడా ఉన్నట్లు పేర్కొంది. సైబర్ భద్రతా పరిశోధకుడు మార్క్ హోఫర్ జనవరిలో "డైనమిక్ కంట్రోల్ ప్లాట్ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్" అనే వెబ్సైట్లో తన ఫొటో, పాస్పోర్ట్ నంబర్, మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు గుర్తించినట్లు కథనం వెల్లడించింది.
ఆ డేటాబేస్లో భారత్, పాకిస్థాన్, తైవాన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, బ్రిటన్, అమెరికా, ఈజిప్ట్, ఇరాన్, ఇజ్రాయెల్, మొరాకో, సూడాన్ తదితర దేశాలకు చెందిన విదేశీయుల సమాచారం ఉన్నట్లు పేర్కొంది. కెమెరాలు, ఫోన్ సిగ్నల్స్ ద్వారా వారి కదలికలను ట్రాక్ చేసినట్లు, ప్రయాణ వివరాలు, వ్యక్తిగత సమాచారం నమోదు చేసినట్లు కథనం తెలిపింది. ఈ నిఘా వ్యవస్థకు చైనా పోలీసులకు సాంకేతిక పరికరాలు అందించే సంస్థతో సంబంధాలు ఉన్నట్లు కూడా పేర్కొంది. అయితే ఈ ఆరోపణలపై చైనా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!