
జనరల్

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేత సౌరవ్ దాస్ నేపథ్యం, పౌరసత్వానికి సంబంధించిన ఆరోపణలపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యక్తిగత వివరాలు, కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రుల పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
ఈ ఆరోపణలకు సంబంధించిన అన్ని వివరాలను పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు కోర్టు సూచించింది. దర్యాప్తులో ఆరోపణలు నిజమని నిర్ధారణ అయితే చట్ట ప్రకారం ఆయన పాస్‌పోర్ట్, ఆధార్ కార్డుల రద్దు అంశం పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!