
జనరల్

కేంద్ర పరిధిలోని ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపక పోస్టుల ఖాళీలపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక కీలక వివరాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 56.2 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా, 38.3 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 18 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ కాలేదని నివేదిక పేర్కొంది. మొత్తంగా కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో 34 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది.
ఐఐటీల్లో 39 శాతం, ఐఐఎంల్లో 31 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. అత్యధికంగా ట్రిపుల్ ఐటీల్లో 54 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపకుల కొరతకు సంబంధించిన గణాంకాలను ఈ నివేదిక వెలుగులోకి తీసుకొచ్చింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!