

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో తుర్కియే మరియు ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. తుర్కియే అధ్యక్షుడు రెజెప్ తయ్యిప్ ఎర్డోగాన్, సిరియా మరియు లెబనాన్‌లపై ఇజ్రాయెల్ సైనిక చర్యలు ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరించారు. జెరూసలేం విముక్తికి పిలుపునిస్తూ, ఇజ్రాయెల్ చర్యలు ప్రాంతీయ సమస్యకే పరిమితం కాకుండా ప్రపంచ స్థిరత్వానికే ముప్పుగా మారుతున్నాయని పేర్కొన్నారు. తూర్పు మధ్యధరా ప్రాంతంలో తుర్కియే ప్రయోజనాలు, సైప్రస్‌లోని తమ ప్రజలకు ముప్పు వాటిల్లితే కఠినంగా స్పందిస్తామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌పై దృఢ వైఖరి అవలంబించాలని కోరారు.
ఈ వ్యాఖ్యలకు ప్రతిగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఎర్డోగాన్‌ను యూదు వ్యతిరేక నియంతగా విమర్శిస్తూ, హమాస్‌కు మద్దతు ఇస్తూ తన దేశంలో ప్రత్యర్థులను అణచివేస్తున్న వ్యక్తికి ఇజ్రాయెల్‌పై వ్యాఖ్యానించే హక్కు లేదన్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ కూడా ఘాటుగా స్పందిస్తూ, జెరూసలేం శాశ్వత రాజధానిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ పరిణామాలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!