
ఓటీటీ

ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. Xలో జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన Instagram గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. “ఇన్స్టాగ్రామ్ అమ్మాయిల కోసం” అంటూ మస్క్ చేసిన కామెంట్‌పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అనంతరం పెద్దవాళ్లు తమ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ పంపుతున్నారంటూ ఆయన చేసిన మరో సరదా వ్యాఖ్య కూడా వివాదానికి దారితీసింది.
మస్క్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు దానిని సరదా ట్రోలింగ్‌గా తీసుకోగా, మరికొందరు లింగ వివక్ష భావజాలాన్ని ప్రోత్సహించే వ్యాఖ్యలుగా విమర్శించారు. ఈ ఘటనతో ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌ల మధ్య ఉన్న భిన్నమైన సంస్కృతులపై కూడా చర్చ మొదలైంది. ఏ ప్లాట్‌ఫామ్ ఎక్కువ నిజాయితీగా ఉంటుంది? ఏది విజువల్, ఏది చర్చలకు అనుకూలం? అనే అంశాలపై నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!