
జనరల్

ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 892 గ్రామాలను అత్యంత సున్నిత ప్రాంతాలుగా గుర్తించింది. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో వర్షపాతం లోటు నమోదవగా, వాటిలో 39 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వానాకాలం సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని, ముఖ్యంగా వరి సాగు సగానికి పైగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం 32 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధమైంది. గ్రామాల వారీగా ప్రత్యేక పర్యవేక్షణతో పాటు రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించనుంది. కొన్ని పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుండగా, రైతు వేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను పంపిణీ చేయనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!