

మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేరళ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం కూడా ఉంది. మొత్తం పది ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఈ కేసు కోచిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) నుంచి ఎక్స్‌లాజిక్ సొల్యూషన్స్‌కు జరిగిన చెల్లింపులకు సంబంధించినదిగా అధికారులు తెలిపారు. ఈ సంస్థ విజయన్ కుమార్తె టీ. వీణకు చెందినది.
సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ నివేదిక ప్రకారం, ఎలాంటి ఐటీ సేవలు అందించకుండానే ఎక్స్‌లాజిక్ సొల్యూషన్స్ రూ.2.73 కోట్లు స్వీకరించినట్లు వెల్లడైంది. 2017 నుంచి 2020 మధ్య రూ.1.72 కోట్లు చెల్లించబడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై కేంద్రం ఆదేశాల మేరకు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వీణపై ఈడీ కేసు నమోదు చేసి సోదాలు చేపట్టింది. అలాగే కొజికోడ్‌లోని మాజీ మంత్రి మహమ్మద్ రియాస్ నివాసంలో కూడా తనిఖీలు నిర్వహించింది. ఆయన వీణ భర్త.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!