

గవర్నర్ వరంగల్ పర్యటన సందర్భంగా భద్రత, ప్రోటోకాల్, ట్రాఫిక్, పారిశుధ్యం, వైద్య సేవలు, విద్యుత్, తాగునీరు, పార్కింగ్, మీడియా నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉదయం ఎన్ఐటీ వరంగల్ చేరుకున్న అనంతరం హన్మకొండ ఐడీఓసీ ఆవరణలో నషా ముక్త్ భారత్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించి వారితో ముఖాముఖి నిర్వహిస్తారు.
తదుపరి పెద్దమ్మగడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడనున్నారు. విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించిన అనంతరం హన్మకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో సమావేశమై అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. మధ్యాహ్నం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని సందర్శించి సేవలను పరిశీలించిన తర్వాత సాయంత్రం భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హైదరాబాద్కు బయలుదేరుతారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!