

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 10 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సంబంధించిన నివాసాలతో పాటు, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దస్తగిరికి చెందిన ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
మనీలాండరింగ్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల కోణంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హవాలా మార్గంలో నగదు చెల్లింపులు జరిగినట్లు ఈడీ అనుమానిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రాంతాల్లో, హైదరాబాద్‌లో ఆరు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో కీలక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!