
సినిమాలు

కేంద్ర ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం నిర్ణయాల తీరుపై దాఖలైన పిటిషన్‌ను పరిశీలించింది. పిటిషనర్ ఆరోపణల ప్రకారం, ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలను ఇతర ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండానే తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం నుంచి సమాధానం కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణం సస్పెండ్ చేయాలన్న మధ్యంతర అభ్యర్థనపై కోర్టు వెంటనే ఆదేశాలు ఇవ్వలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!