

అఫ్గానిస్థాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6.59 గంటలకు భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. ఉత్తర అక్షాంశం 36.05 డిగ్రీలు, తూర్పు రేఖాంశం 68.87 డిగ్రీల వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. భూఉపరితలానికి 125 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు తెలిపింది. అఫ్గాన్ రాజధాని కాబూల్‌కు సుమారు 165 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిపింది.
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ చుట్టూ ఉన్న భూకంప క్రియాశీల ప్రాంతాల్లో హిందూ కుష్ కూడా ఒకటిగా ఉంది. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో పలుమార్లు భూకంపాలు సంభవించాయి. వీటిని అంతర్జాతీయ, ప్రాంతీయ భూకంప కేంద్రాల సంస్థలు నమోదు చేశాయి. ప్రపంచంలోని చురుకైన భూకంప మండలాల్లో ఒకటైన ప్రాంతంలో అఫ్గానిస్థాన్ విస్తరించి ఉండటంతో అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!