
రాజకీయాలు

ప్రయాణికులు, సరుకులను ఒకే రైలులో తరలించే విధంగా ప్యాసింజర్ కమ్ కార్గో డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టే ఆలోచనలో భారతీయ రైల్వేలు ఉన్నాయి. వందేభారత్ సిరీస్‌లో ఈ రైళ్లను నడపవచ్చని రైల్వే బోర్డు కమిటీ ప్రతిపాదించింది. పై అంతస్తులో ప్రయాణికులు, కింది భాగంలో సరుకు రవాణా చేసే విధంగా ఈ రైళ్ల రూపకల్పన ఉండనుంది.
నాలుగేళ్ల క్రితం ప్రతిపాదించిన ‘బెల్లీ ఫ్రైట్’ కాన్సెప్ట్‌కు మళ్లీ జీవం పోసే దిశగా రైల్వేలు అడుగులు వేస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై ప్రధానమంత్రి కార్యాలయం అభిప్రాయం కోసం రైల్వే శాఖ ఎదురుచూస్తోంది. అనుమతులు లభిస్తే భవిష్యత్‌లో వందేభారత్ తరహా రైళ్లలో ఈ కొత్త విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!