
రాజకీయాలు

భారత్ పన్నుల వ్యవస్థ, పన్ను చెల్లింపుదారులకు అందుతున్న ప్రజా ప్రయోజనాలపై ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. భారత్‌లో పన్నుల నిర్మాణం అమెరికాతో పోటీ పడే స్థాయిలో ఉందని పేర్కొన్న ఆయన.. పన్ను చెల్లింపుదారులకు అందుతున్న ప్రజా ప్రయోజనాలు మాత్రం బంగ్లాదేశ్ వంటి దేశాల స్థాయిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు.
“భారత్ పన్నుల వ్యవస్థ అమెరికాతో పోటీ పడుతోంది. కానీ ప్రజలకు అందే ప్రయోజనాలు బంగ్లాదేశ్ వంటి దేశాల తరహాలో ఉన్నాయి” అని అష్నీర్ గ్రోవర్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. పన్నుల భారం, ప్రజా సేవలు, పన్ను చెల్లింపుదారులకు లభిస్తున్న ప్రయోజనాల మధ్య సమతుల్యతపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!