

బీహార్‌లోని బీహార్ షరీఫ్‌లో ప్రముఖ భోజ్‌పురి నటి కాజల్ రాఘవానీకి చేదు అనుభవం ఎదురైంది. ఓ జువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరుకాగా, నటిను చూసేందుకు అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం, తోపులాట చోటుచేసుకున్నాయి. అనంతరం కాజల్ షోరూమ్ నుంచి బయటకు వచ్చి కారులో వెళ్తుండగా, ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం కారు వెనుక పరుగులు తీశారు. ఈ క్రమంలో కొందరు కారుపై రాళ్లు విసరడంతో అద్దాలు పగిలిపోయినట్లు సమాచారం. షోరూమ్ పరిసరాల్లో ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాజల్ రాఘవానీ క్షేమంపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ ఫోన్లు చేస్తున్న అభిమానుల కోసం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో సందేశం విడుదల చేశారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నానని, తన బృందంలోని ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేశారు. తన క్షేమం గురించి ఆందోళన చెందుతూ ఫోన్లు చేస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!