

కుప్పం నియోజకవర్గ ప్రజలతో తనకు కుటుంబ అనుబంధం ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం ప్రజలు ప్రతి ఇంట్లో తనను కుటుంబసభ్యుడిలా చూస్తారని పేర్కొన్నారు. సొంత నియోజకవర్గ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం కుప్పంలో నిర్వహించిన ‘స్వర్ణ కుప్పం’ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. నారావారిపల్లె తనకు జన్మనిస్తే.. కుప్పం రాజకీయంగా తనకు గుర్తింపునిచ్చిందని అన్నారు. అభివృద్ధి ద్వారా కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రాయలసీమను ఎడారిగా మారకుండా చేసేందుకు నీటి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పానికి నీటిని తీసుకురావడంలో చేపట్టిన ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ.. ప్రాంత అభివృద్ధికి నీటి వనరులు కీలకమని చెప్పారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా హెరిటేజ్ గ్రానైట్ స్టోన్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తామని, మార్కెట్ యార్డును రూ.2.5 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. చంద్రబాబు రెండు రోజుల కుప్పం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉన్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!