
షోస్

తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. దసరాతో పాటు బతుకమ్మ పండుగ కూడా రావడంతో మొత్తం 13 రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు దసరా సెలవులు కొనసాగనున్నాయి. విద్యాసంస్థలకు అక్టోబర్ 9 చివరి పని దినంగా ఉండనుంది.
సెలవులు ముగిసిన అనంతరం అక్టోబర్ 23 నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తించనున్నాయి. రాష్ట్రంలోని అన్ని సంబంధిత విద్యాసంస్థలు ప్రభుత్వం ప్రకటించిన సెలవుల షెడ్యూల్‌ను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!