
జనరల్

తెలంగాణలో ప్రభుత్వ వైద్యుల సంఘం పిలుపు మేరకు నేటి నుంచి డాక్టర్లు సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం వైద్యులు ఆందోళనకు పిలుపునిచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగాయని ఆరోపించిన వైద్యులు జీవో 38ను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓపీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని వైద్యులు ప్రభుత్వాన్ని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!