

జూన్ త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్.. బోనస్ ఈక్విటీ షేర్ల జారీ ప్రతిపాదనను ప్రస్తుతానికి నిలిపివేసింది. వాటాదారులకు దీర్ఘకాలిక విలువను సృష్టించేందుకు వృద్ధి, లాభదాయకతపై మరింత దృష్టి పెట్టాలని బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పేటీఎం నికర లాభం రూ.220 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.123 కోట్లతో పోలిస్తే 79 శాతం వృద్ధి సాధించింది.
ఈ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ ఆదాయం 28 శాతం పెరిగి రూ.2,448 కోట్లకు చేరగా, ఎబిటా 182 శాతం వృద్ధితో రూ.203 కోట్లుగా నమోదైంది. స్థూల వాణిజ్య విలువ (జీఎంవీ) 31 శాతం పెరిగి రూ.7.1 లక్షల కోట్లకు చేరింది. నికర చెల్లింపుల ఆదాయం రూ.601 కోట్లు, ఆర్థిక సేవల విభాగ ఆదాయం రూ.814 కోట్లుగా నమోదయ్యాయి. పేటీఎం మనీలో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంస్థ యోచిస్తుండగా, రైట్స్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు ప్రణాళిక రూపొందిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!