

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) సి. విజయకుమార్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 18.13 మిలియన్ డాలర్ల (సుమారు రూ.175 కోట్లు) పారితోషికం అందుకున్నారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 66.9 శాతం అధికం. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న విజయకుమార్‌కు హెచ్‌సీఎల్ అమెరికా ఇంక్ ద్వారా వేతనం చెల్లిస్తున్నారు. దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు (ఎల్‌టీఐ), రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ (ఆర్‌ఎస్‌యూ) కారణంగా ఆయన పారితోషికం భారీగా పెరిగినట్లు కంపెనీ వార్షిక నివేదిక వెల్లడించింది.
విజయకుమార్ మొత్తం పారితోషికంలో ఎల్‌టీఐ కింద 3.94 మిలియన్ డాలర్లు, ఆర్‌ఎస్‌యూల ద్వారా 9.40 మిలియన్ డాలర్లు లభించాయి. మూలవేతనం 2.48 మిలియన్ డాలర్లు, పనితీరు ఆధారిత బోనస్ 2 మిలియన్ డాలర్లు, ఇతర ప్రయోజనాలు 3.1 లక్షల డాలర్లుగా ఉన్నాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సీఈఓలతో పోలిస్తే విజయకుమార్ పారితోషికం అత్యధికంగా నిలిచింది. హెచ్‌సీఎల్ ఉద్యోగుల మధ్యస్థ వేతనంతో పోలిస్తే ఆయన వేతనం 291.90 రెట్లు అధికంగా ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!