
జనరల్

కొలంబియాను సోమవారం శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా ముగ్గురు చిన్నారులు సహా 111 మంది మృతి చెందినట్లు సమాచారం. భారీ ప్రకంపనలతో పలు భవనాలు దెబ్బతినడంతో పాటు కొన్ని నిర్మాణాలు కూలిపోయాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. బాధితులను గుర్తించి రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
బొగోటాకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ పామార్ సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం భూ ఉపరితలానికి దాదాపు 107 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అమెరికా జియలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!