3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తిరుమల భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

Writer: Harika S 08:24 AM, 3 నవంబర్, 2026
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తిరుమల భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

అతి తీవ్ర తుఫాన్ మురసు ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో తుఫాన్ తీరం దాటడం ప్రారంభించిందని భారత వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించాయి. తీరం వెంట గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా, దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. తిరుమల పద్మావతి అతిథి గృహంలో వివిధ విభాగాల అధికారులతో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. క్యూ లైన్లు బయటకు రాకుండా చూడాలని, భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించాలని ఆదేశించారు. వర్షాల కారణంగా అన్నప్రసాదాల పంపిణీకి అంతరాయం కలగకుండా అవసరమైన ప్రాంతాల్లో టార్పాలిన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని విద్యుత్, ఇంజినీరింగ్ అధికారులను వెంకయ్య చౌదరి ఆదేశించారు. ఘాట్ రోడ్లలో కొండచరియలు, బండరాళ్లు పడే ప్రమాదం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అప్ ఘాట్, డౌన్ ఘాట్ మార్గాల్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలని సూచించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి అవసరమైన భక్తులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం చేసుకుని సురక్షితంగా స్వస్థలాలకు చేరుకునేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ మనోహరం, ఎస్ఈ వేణుగోపాల్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమకుమారి, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మురసు తుఫాన్‌పై తెల్లవారుజామున సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు

మురసు తుఫాన్‌పై తెల్లవారుజామున సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు

పూర్తిగా తీరం దాటిన మురసు తుఫాను.. మరో 24 గంటలు అప్రమత్తం

పూర్తిగా తీరం దాటిన మురసు తుఫాను.. మరో 24 గంటలు అప్రమత్తం

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్

నవంబర్‌లో పాఠశాలలకు భారీగా సెలవులు..

నవంబర్‌లో పాఠశాలలకు భారీగా సెలవులు..

వచ్చే ఏడాది చివరి నాటికి ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ
ట్యాగ్లు
మురసు తుఫాన్తిరుమలటీటీడీ ఏర్పాట్లుభక్తుల భద్రతభారీ వర్షాలుతిరుపతి వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

వచ్చే ఏడాది చివరి నాటికి ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

కోళ్ల ధరలు తగ్గకుండా పౌల్ట్రీ సంఘాల కొత్త నిర్ణయం

కోళ్ల ధరలు తగ్గకుండా పౌల్ట్రీ సంఘాల కొత్త నిర్ణయం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ఎంపీ వంశీకృష్ణ సంచలన లేఖ
రాజకీయాలు

కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ఎంపీ వంశీకృష్ణ సంచలన లేఖ

జగన్‌ను టార్గెట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి
రాజకీయాలు

జగన్‌ను టార్గెట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి

ఉక్రెయిన్‌లో సహాయ శిబిరాలపై రష్యా భీకర దాడులు
జనరల్

ఉక్రెయిన్‌లో సహాయ శిబిరాలపై రష్యా భీకర దాడులు

‘విదేశీ సాయం’ వ్యాఖ్యలపై మోదీకి రాహుల్ గాంధీ బహిరంగ సవాల్
రాజకీయాలు

‘విదేశీ సాయం’ వ్యాఖ్యలపై మోదీకి రాహుల్ గాంధీ బహిరంగ సవాల్

RC17: ప్రతీకార కథ?
సినిమాలు

RC17: ప్రతీకార కథ?

ENE రిపీట్ సినిమాలో అనిల్ రావిపూడి స్పెషల్ ఎంట్రీ?
గాసిప్స్

ENE రిపీట్ సినిమాలో అనిల్ రావిపూడి స్పెషల్ ఎంట్రీ?

సూర్య, ధనుష్‌లతో మణిరత్నం భారీ మల్టీస్టారర్?
గాసిప్స్

సూర్య, ధనుష్‌లతో మణిరత్నం భారీ మల్టీస్టారర్?

ఖాన్ ల రికార్డులు బద్దలు కొట్టిన తలైవా?
సినిమాలు

ఖాన్ ల రికార్డులు బద్దలు కొట్టిన తలైవా?

ప్రభాస్‌నే నమ్ముకున్న నిర్మాణ సంస్థ?
గాసిప్స్

ప్రభాస్‌నే నమ్ముకున్న నిర్మాణ సంస్థ?

సంక్రాంతి ప్రమోషన్లలో ముందంజలో మహాకాళి
సినిమాలు

సంక్రాంతి ప్రమోషన్లలో ముందంజలో మహాకాళి

మున్సిపల్ ఎన్నికల వేళ ఉద్రిక్తత.. వైఎస్ జగన్‌పై కేసు నమోదు
జనరల్

మున్సిపల్ ఎన్నికల వేళ ఉద్రిక్తత.. వైఎస్ జగన్‌పై కేసు నమోదు

అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న రామాయణం
గాసిప్స్

అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న రామాయణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!