3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మురసు తుఫాన్‌పై తెల్లవారుజామున సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు

Writer: Pooja 09:30 AM, 3 నవంబర్, 2026
మురసు తుఫాన్‌పై తెల్లవారుజామున సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో మురసు తుఫాన్ పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు మరోసారి జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ రాత్రి 1 గంటకు ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని తాకిందని, ఉదయం 6:30 గంటలకు పూర్తిగా తీరం దాటుతుందని అధికారులు సీఎంకు వివరించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రాకుండా చూడాలని చంద్రబాబు సూచించారు. విద్యుత్ స్తంభాలు, సబ్‌స్టేషన్ల పరిస్థితిపై కూడా ఆరా తీశారు. ఇప్పటివరకు ఎక్కడా విద్యుత్ స్తంభాలు కూలిపోలేదని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగలేదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఆస్తి నష్టాన్ని కూడా వీలైనంత వరకు నివారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను సీఎంకు వివరించారు. బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ముఖ్యంగా రేపల్లె, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉందని కలెక్టర్ తెలిపారు. రెండు చోట్ల చెట్లు కూలిపోగా వెంటనే తొలగించినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఏడు చోట్ల చెట్లు కూలిపోగా, వాటిని తొలగించామని కలెక్టర్ హిమాన్షు శుక్లా వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఐదు ప్రాంతాల్లో చెట్లు పడిపోయినట్లు సమాచారం అందగానే చర్యలు చేపట్టామని కలెక్టర్ రాజాబాబు వివరించారు. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, నాగాయలంక ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. గుంటూరు జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైనప్పటికీ, విద్యుత్ స్తంభాలు లేదా చెట్లు కూలిన ఘటనలు చోటుచేసుకోలేదని కలెక్టర్ వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయని, బుడమేరు ప్రాంతంలో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందనే ముందస్తు జాగ్రత్తతో కొన్ని కుటుంబాలను సహాయ శిబిరాలకు తరలించినట్లు చెప్పారు.

మరోవైపు, తుఫాన్ సహాయక చర్యలు కొనసాగిస్తూనే స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. చంద్రబాబు సోమవారం రాత్రి 10 గంటలకే అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ప్రతి గంటకూ అధికారుల నుంచి పరిస్థితిపై సమాచారం తీసుకుంటూనే ఉన్నారు. సోమవారం రోజంతా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS)లో ఉండి తుఫాన్ పరిస్థితిని సమీక్షించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేస్తూ సోమవారం మూడు టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విమాన ఛార్జీల పెంపుపై కే. నారాయణ ఆగ్రహం..

విమాన ఛార్జీల పెంపుపై కే. నారాయణ ఆగ్రహం..

ఉక్రెయిన్‌లో సహాయ శిబిరాలపై రష్యా భీకర దాడులు

ఉక్రెయిన్‌లో సహాయ శిబిరాలపై రష్యా భీకర దాడులు

మున్సిపల్ ఎన్నికల వేళ ఉద్రిక్తత.. వైఎస్ జగన్‌పై కేసు నమోదు

మున్సిపల్ ఎన్నికల వేళ ఉద్రిక్తత.. వైఎస్ జగన్‌పై కేసు నమోదు

పూర్తిగా తీరం దాటిన మురసు తుఫాను.. మరో 24 గంటలు అప్రమత్తం

పూర్తిగా తీరం దాటిన మురసు తుఫాను.. మరో 24 గంటలు అప్రమత్తం

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్
ట్యాగ్లు
మురసు తుఫాన్చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్వాతావరణ హెచ్చరికవిపత్తు నిర్వహణతుఫాన్ అప్డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తిరుమల భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తిరుమల భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సేవా రంగంలో జీఆర్‌టీ జువెలర్స్‌ మరో ముందడుగు
బిజినెస్

సేవా రంగంలో జీఆర్‌టీ జువెలర్స్‌ మరో ముందడుగు

రాప్తాడు ఘటన.. నిందితుడు హేమంత్ కుడి కాలు తొలగింపు..
జనరల్

రాప్తాడు ఘటన.. నిందితుడు హేమంత్ కుడి కాలు తొలగింపు..

జోయ్ అలుక్కాస్ జన్మదిన వేడుకల్లో సేవా సందేశం
బిజినెస్

జోయ్ అలుక్కాస్ జన్మదిన వేడుకల్లో సేవా సందేశం

ఒమన్ తీరంలో కలకలం
జనరల్

ఒమన్ తీరంలో కలకలం

కింగ్ సినిమాలో షారుఖ్‌తో కలిసి స్టెప్పులేయనున్న కరీనా కపూర్
సినిమాలు

కింగ్ సినిమాలో షారుఖ్‌తో కలిసి స్టెప్పులేయనున్న కరీనా కపూర్

నేపాల్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం
జనరల్

నేపాల్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం

కన్నడ బాక్సాఫీస్‌లో మొదలైన రికార్డుల వేట
సినిమాలు

కన్నడ బాక్సాఫీస్‌లో మొదలైన రికార్డుల వేట

టీజర్‌కు బదులుగా నేరుగా ట్రైలర్‌తో రానున్న షారుఖ్ ఖాన్ కింగ్?
గాసిప్స్

టీజర్‌కు బదులుగా నేరుగా ట్రైలర్‌తో రానున్న షారుఖ్ ఖాన్ కింగ్?

ఆన్‌లైన్ పైరసీకి చెక్.. రామాయణ చిత్రానికి బాంబే హైకోర్టు రక్షణ
సినిమాలు

ఆన్‌లైన్ పైరసీకి చెక్.. రామాయణ చిత్రానికి బాంబే హైకోర్టు రక్షణ

బిగ్‌బాస్ తెలుగు 10 డే 58 ప్రోమో 1: హౌస్‌లో నామినేషన్ల వేడి
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 58 ప్రోమో 1: హౌస్‌లో నామినేషన్ల వేడి

రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చేసిన అనకాపల్లి
ఓటీటీ

రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చేసిన అనకాపల్లి

మోక్షజ్ఞ సినిమా ఎందుకింత ఆలస్యమవుతుంది?
సినిమాలు

మోక్షజ్ఞ సినిమా ఎందుకింత ఆలస్యమవుతుంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!