

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ 2 అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం వసూళ్ల పరంగా సంచలనం నమోదు చేసింది. ఇప్పటివరకు ఏ తమిళ సినిమా సాధించని విధంగా 9 మిలియన్ డాలర్ల మార్కును దాటిన తొలి చిత్రంగా నిలిచింది. విడుదలైన 18 రోజుల్లోనే 9.06 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ.85.80 కోట్లకు సమానం. దీంతో రజనీ అభిమానులు ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.అంతేకాదు, గల్ఫ్ ప్రాంతంలో గతంలో భారీ వసూళ్లు సాధించిన అమీర్ ఖాన్ దంగల్, సల్మాన్ ఖాన్ సుల్తాన్ చిత్రాల జీవితకాల కలెక్షన్లను కూడా జైలర్ 2 అధిగమించింది. దంగల్ 8.8 మిలియన్ డాలర్లు, సుల్తాన్ 8.57 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, వాటిని వెనక్కి నెట్టి ముందంజ వేసింది. ఈ ఘనతతో గల్ఫ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో 6వ స్థానాన్ని సొంతం చేసుకుంది. రాబోయే రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!