3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వచ్చే ఏడాది చివరి నాటికి ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

Writer: Harika S 07:24 AM, 3 నవంబర్, 2026
వచ్చే ఏడాది చివరి నాటికి ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల భవన నిర్మాణ పనుల పురోగతిపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్. చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, వివిధ జిల్లాల డీసీహెచ్‌ఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని గౌరవ్ ఉప్పల్ మంత్రికి వివరించారు. సెకండరీ హెల్త్‌కేర్ డైరెక్టరేట్ పరిధిలో ఇప్పటికే తొమ్మిది ఆసుపత్రుల భవనాలు పూర్తయ్యాయని, డిసెంబర్ నాటికి మరో 14, 2027 మార్చి నాటికి ఇంకో 11 భవనాల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. అదనంగా మరో 45 భవనాల పనులు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు.

పూర్తయిన తొమ్మిది ఆసుపత్రుల భవనాల్లో అవసరమైన వైద్య పరికరాలు, ఫర్నీచర్ ఏర్పాటు చేసి వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. డిసెంబర్, మార్చి నాటికి పూర్తయ్యే భవనాలకు అవసరమైన పరికరాలు, ఫర్నీచర్ కొనుగోలు ప్రక్రియను కూడా వెంటనే ప్రారంభించాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను 2027 చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో కనీసం 90 శాతం మంది రోగులకు స్థానికంగానే వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు కీలకమని పేర్కొన్నారు. గత మూడేళ్లలో వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు సహా ఆరోగ్యశాఖలో సుమారు 15 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇటీవల 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించామని గుర్తుచేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే బాధ్యత డీసీహెచ్‌ఎస్‌లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లపై ఉందన్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఆసుపత్రుల్లో నీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోళ్ల ధరలు తగ్గకుండా పౌల్ట్రీ సంఘాల కొత్త నిర్ణయం

కోళ్ల ధరలు తగ్గకుండా పౌల్ట్రీ సంఘాల కొత్త నిర్ణయం

ఆంధ్ర తీరం వైపు మురసు తుఫాన్.. భారీ వర్షాల హెచ్చరికలు, పలు జిల్లాల్లో సెలవులు

ఆంధ్ర తీరం వైపు మురసు తుఫాన్.. భారీ వర్షాల హెచ్చరికలు, పలు జిల్లాల్లో సెలవులు

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

విశాఖ HPCL రిఫైనరీలో మంటలు.. భయపడొద్దంటూ ప్రజలకు పోలీసుల భరోసా

విశాఖ HPCL రిఫైనరీలో మంటలు.. భయపడొద్దంటూ ప్రజలకు పోలీసుల భరోసా

ట్రేడింగ్ మోసంలో కానిస్టేబుల్‌కు టోకరా.. రూ.29.20 లక్షలు స్వాహా!

ట్రేడింగ్ మోసంలో కానిస్టేబుల్‌కు టోకరా.. రూ.29.20 లక్షలు స్వాహా!

చుక్క నీటి కోసం పాతాళానికి వెళ్లాల్సిందేనా?

చుక్క నీటి కోసం పాతాళానికి వెళ్లాల్సిందేనా?

ట్యాగ్లు
తెలంగాణ ఆరోగ్యశాఖదామోదర్ రాజనర్సింహఆసుపత్రుల నిర్మాణంకమ్యూనిటీ హెల్త్ సెంటర్లుఏరియా ఆసుపత్రులువైద్య సదుపాయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తిరుమల భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
జనరల్

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తిరుమల భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

రోలెక్స్ సినిమా అప్‌డేట్.. లోకేష్‌నే అడగాలంటున్న సూర్య!
సినిమాలు

రోలెక్స్ సినిమా అప్‌డేట్.. లోకేష్‌నే అడగాలంటున్న సూర్య!

నవంబర్‌లో పాఠశాలలకు భారీగా సెలవులు..
జనరల్

నవంబర్‌లో పాఠశాలలకు భారీగా సెలవులు..

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు వేళాయె.. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
రాజకీయాలు

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు వేళాయె.. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

వచ్చే ఏడాది చివరి నాటికి ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ
జనరల్

వచ్చే ఏడాది చివరి నాటికి ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

కోళ్ల ధరలు తగ్గకుండా పౌల్ట్రీ సంఘాల కొత్త నిర్ణయం
జనరల్

కోళ్ల ధరలు తగ్గకుండా పౌల్ట్రీ సంఘాల కొత్త నిర్ణయం

ఆంధ్ర తీరం వైపు మురసు తుఫాన్.. భారీ వర్షాల హెచ్చరికలు, పలు జిల్లాల్లో సెలవులు
జనరల్

ఆంధ్ర తీరం వైపు మురసు తుఫాన్.. భారీ వర్షాల హెచ్చరికలు, పలు జిల్లాల్లో సెలవులు

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

విశాఖ HPCL రిఫైనరీలో మంటలు.. భయపడొద్దంటూ ప్రజలకు పోలీసుల భరోసా
జనరల్

విశాఖ HPCL రిఫైనరీలో మంటలు.. భయపడొద్దంటూ ప్రజలకు పోలీసుల భరోసా

స్పీకర్‌పై వ్యాఖ్యల కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల బెయిల్ రద్దు కోరిన ప్రభుత్వం
రాజకీయాలు

స్పీకర్‌పై వ్యాఖ్యల కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల బెయిల్ రద్దు కోరిన ప్రభుత్వం

ట్రేడింగ్ మోసంలో కానిస్టేబుల్‌కు టోకరా.. రూ.29.20 లక్షలు స్వాహా!
జనరల్

ట్రేడింగ్ మోసంలో కానిస్టేబుల్‌కు టోకరా.. రూ.29.20 లక్షలు స్వాహా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!