

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో మరో భారీ సినిమా రాబోతుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి ప్రతీకార నేపథ్యంతో కూడిన పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించేందుకు సుకుమార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ కథపై ఆయన దాదాపు 2 సంవత్సరాలుగా కసరత్తు చేస్తున్నారట. స్క్రిప్ట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, చరణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కథను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి.ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. రంగస్థలం తర్వాత చరణ్‌తో సుకుమార్ చేయబోయే సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!