
జనరల్

దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్షాలు ‘విదేశీ సాయాన్ని’ తీసుకుంటున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ అంశంపై ప్రధానితో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ప్రతిపక్షాలపై చేసిన ఆరోపణలకు మోదీ బహిరంగంగా సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.
అంతేకాకుండా, విదేశీ సాయం వల్లే మోదీ ప్రధాని పదవిని చేపట్టారని రాహుల్ ఎదురుదాడి చేశారు. “దేశానికి అబద్ధాలు చెప్పడం మానండి. విదేశీ సాయంతోనే మీరు ప్రధాని అయ్యారు. మీ నిధులన్నీ విదేశీయుల సాయంతో వచ్చినవే” అని వ్యాఖ్యానించారు. విదేశీ ప్రభావం, ప్రతిపక్షాలపై ఆరోపణల అంశం ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ మధ్య మరోసారి రాజకీయ వాగ్వాదానికి దారితీసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!