

రాష్ట్రంలో కౌలు రైతులకు పంట రుణాలు అందించడంలో వాణిజ్య బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించినప్పటికీ, బ్యాంకులు పరిమిత స్థాయిలో మాత్రమే రుణాలు మంజూరు చేస్తున్నాయి. కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు ఉన్నప్పటికీ రుణాల పంపిణీ ఆశించిన స్థాయిలో జరగడం లేదు.
2022-23లో 2,58,310 ఖాతాలకు రూ.2,191.3 కోట్ల రుణ లక్ష్యం ఉండగా, కేవలం 69,832 ఖాతాలకు రూ.905.8 కోట్లు మాత్రమే అందించారు. 2023-24లో అదే లక్ష్యానికి కేవలం 37,243 ఖాతాలకు రూ.323.7 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. 2024-25లో రూ.2,100 కోట్ల లక్ష్యంలో 41,205 ఖాతాలకు రూ.510 కోట్లు మాత్రమే రుణాలుగా ఇచ్చారు.
అయితే 2025-26లో పరిస్థితి కొంత మెరుగుపడింది. 2,94,395 ఖాతాలకు రూ.3,000 కోట్ల లక్ష్యం ఉండగా, 2,03,432 ఖాతాలకు రూ.1,666.2 కోట్లు పంపిణీ చేశారు. రుణాల పంపిణీ శాతం 2022-23లో 41 శాతం, 2023-24లో 15 శాతం, 2024-25లో 24 శాతం, 2025-26లో 56 శాతంగా నమోదైంది. 2026-27లో కౌలు రైతులకు సుమారు రూ.5,000 కోట్ల రుణాలు అందించాలని ప్రతిపాదించారు.
2022-23 లక్ష్యం – రూ.2,191.3 కోట్లు
2022-23 పంపిణీ – రూ.905.8 కోట్లు
2023-24 పంపిణీ – రూ.323.7 కోట్లు
2024-25 పంపిణీ – రూ.510 కోట్లు
2025-26 లక్ష్యం – రూ.3,000 కోట్లు
2025-26 పంపిణీ – రూ.1,666.2 కోట్లు
2022-23 రుణ శాతం – 41 శాతం
2023-24 రుణ శాతం – 15 శాతం
2024-25 రుణ శాతం – 24 శాతం
2025-26 రుణ శాతం – 56 శాతం
2026-27 ప్రతిపాదిత రుణాలు – రూ.5,000 కోట్లు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!