
రాజకీయాలు

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఏనుగుల దాడిలో ఓ రైతు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా చిన్నమటార్లపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏనుగుల దాడిలో రైతుతో పాటు ఓ పాడి ఆవు కూడా మృతి చెందింది. ఈ ఘటన స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
తమిళనాడు అటవీశాఖ అధికారులు ఏనుగుల గుంపును కుప్పం అటవీ ప్రాంతం వైపు తరలిస్తున్న సమయంలో అవి రైతిపై దాడి చేసినట్లు సమాచారం. సుమారు 40 కిలోమీటర్ల మేర సంచరించిన ఏనుగుల గుంపు కుప్పం బస్టాండ్ వరకు వచ్చినట్లు ఆర్టీసీ డ్రైవర్ విశ్వనాథ్ తెలిపారు. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!