
జనరల్

కేంద్ర ప్రభుత్వం జనగణన-2027 నిర్వహణకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ 2026 అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా జనాభా గణనకు అవసరమైన ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.
దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనగణన ప్రక్రియ 2027 మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. 2026 అక్టోబర్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు వివిధ దశల్లో గణన చేపట్టనున్నారు. జనాభా వివరాలను సేకరించేందుకు లక్షలాది మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!