
రాజకీయాలు

గుజరాత్‌లో చండీపుర వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 184 అనుమానిత కేసులు నమోదుకాగా, వాటిలో 35 మందికి చండీపుర వైరస్ సోకినట్లు ప్రయోగశాల పరీక్షల్లో నిర్ధారణ అయింది.
ఈ వైరస్ గుజరాత్‌లోని పలు జిల్లాలకు విస్తరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి, పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసింది. ప్రజలు జ్వరం, తలనొప్పి లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!