

రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్‌లోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో దేశ్‌పాండే ఫౌండేషన్, దాతల సహకారంతో రూ.25 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన స్కిల్ ప్లస్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పాల్గొన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
అంతకుముందు కాలేజీ ప్రాంగణంలో మొక్కలు నాటిన మంత్రి, అధికారులు అనంతరం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ నెహ్రూ మెమోరియల్ పాఠశాల విద్యార్థులకు డీవార్మింగ్ మాత్రలను పంపిణీ చేశారు. అలాగే పర్వతగిరి ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు అందించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు కీలకమని అధికారులు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!