

దేశ ఆర్థిక అభివృద్ధి, ఆహార భద్రత, పర్యావరణ సమతుల్యతకు నీటి వనరులు కీలకమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, భూగర్భ జలాల తగ్గుదల, వేగవంతమైన పట్టణీకరణ కారణంగా నీటి రంగంలో సవాళ్లు పెరుగుతున్నాయని తెలిపారు. మానవ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ, సమర్థవంతమైన, దీర్ఘకాలిక నీటి నిర్వహణ విధానాలను అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
ఢిల్లీలో నిర్వహించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జలవనరుల శాఖ ఉన్నతాధికారుల అఖిల భారత సదస్సులో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. డ్యామ్ భద్రతా చట్టం, 2021ను సమర్థవంతంగా అమలు చేయాలని, ఈ ఏడాది డిసెంబర్‌లోపు డ్యామ్ భద్రతా మూల్యాంకనాలు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. అలాగే జలాశయాల్లో పూడిక తొలగింపు పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!