

ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ దశకు చేరుకుంది. టైటిల్ కోసం నాలుగు జట్లు పోటీలో ఉండగా, తొలి సెమీఫైనల్‌లో ఫ్రాన్స్ మరియు స్పెయిన్ జట్లు నేడు అర్ధరాత్రి తలపడనున్నాయి. ఈ హోరాహోరీ పోరుపై ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఫ్రాన్స్ జట్టుకు కిలియన్ ఎంబాపె ప్రధాన బలంగా నిలుస్తుండగా, ఉస్మాన్ డెంబెలె కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు 16 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ సెమీస్‌లోకి అడుగుపెట్టిన స్పెయిన్ జట్టు కెప్టెన్ రోడ్రి, యువ సంచలనం లామినె యామల్పై భారీ ఆశలు పెట్టుకుంది.
ఇప్పటివరకు ఈ రెండు జట్లు 38 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తలపడగా, స్పెయిన్ 18 విజయాలతో, ఫ్రాన్స్ 13 విజయాలతో ఉన్నాయి. మరో ఏడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే వరల్డ్ కప్ లో ఇరు జట్లు ఒక్కసారి మాత్రమే ఎదురుపడగా, ఆ మ్యాచ్‌లో ఫ్రాన్స్ విజయం సాధించింది. దీంతో ఈ సెమీఫైనల్ మరింత ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!