
సినిమాలు

తమిళనాడులోని సేలం జిల్లా ఆత్తూర్‌లో ఉన్న ప్రసిద్ధ మారియమ్మన్ ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ వివాదాస్పద బ్యానర్ కలకలం రేపింది. బ్యానర్లో తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ను రావణాసురుడి రూపంలో, సినీనటి త్రిషను అమ్మవారి అవతారంలో చిత్రీకరించడం వివాదానికి దారితీసింది. ఈ పోస్టర్‌పై భక్తులు, స్థానికులు, నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివాదాస్పద బ్యానర్‌ను తొలగించారు. బ్యానర్ ఏర్పాటు చేసిన ఇద్దరు యువకులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ జరుగుతుండగా, పండుగల సమయంలో మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసే చర్యలను నివారించాలని పలువురు కోరుతున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!